చిత్రం లేదు
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్సైబరాబాద్లో ఏజెంట్లకే రూ.2.5కోట్లు ఖర్చు అయ్యాయా?
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సంచలన వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 2 నెలల వ్యవధిలోనే రూ.2.5 కోట్లు బదిలీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. అదికూడా ఒకే కంపెనీకి, ఒకేరోజు దాదాపు రూ.90 లక్షల వరకు బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 2 నెలల్లోనే రూ.2.5 కోట్లను 2 కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడంపై పోలీస్ వర్గాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజానిజాలు బయటకు రావాలని పలువురు అడుగుతున్నారు. ఇంత మొత్తంలో డబ్బు బయటకు వెళ్లిందంటే సీపీకి తెలిసే ఇది జరిగిందా? డీజీపీకి తెలియకుండా జరిగిందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
