తెలంగాణ

కొండా సుస్మిత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా?!..

తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అసమ్మతి రాగం టీ కాంగ్రెస్ లో హైపిచ్ లో వినిపిస్తుండగా.. పదవుల పంపాకాలపై కూడా కొందరు నేతలు నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదివరకు తరచుగా జరిగే పంచాయితీ అయినా ఇప్పుడు కాస్త ఘాటుగా మారిన అంశం.. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ వ్యవహారం.. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన.. క్రమక్రమంగా కొండా ఫ్యామిలీ మాటలు రాజకీయాల్లో తరచుగా మంటలు పుట్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. గతంలో పలుమార్లు నోరు జారిన.. ఏదో సద్దుమనిగింది.. కానీ ఈసారి మాత్రం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.