తెలంగాణ

Warangal: పెద్ది కుటుంబం పై పెద్దమనస్సు చాటిన కేసీఆర్!..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున.. మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయనున్నారు. మొత్తంగా పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం అందనుంది. పిల్లల చదువు, భవిష్యత్‌తో పాటు కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ తెలిపారు.