తెలంగాణ

warangal: హోటల్ ఫుడ్‌పై షాకింగ్ నిజాలు.. తనిఖీల్లో బయటపడుతున్న కల్తీ బాగోతం!..

చూస్తే నోరూరిస్తుంది.. కానీ తింటే ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. హనుమకొండలో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో రసాయనాలు కలిపిన చికెన్‌తో పాటు పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు బయటపడటం కలకలం రేపుతోంది. హోటళ్లలో మాంసం నిల్వ చేసే విధానం, మిఠాయిల్లో హానికర రంగులు, పండ్లను త్వరగా పండించేందుకు రసాయనాల వినియోగం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో.. ఆహార నాణ్యతపై నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది.