తెలంగాణ

Wanaparthy: విద్యుత్‌ రంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట.. సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు!..

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్‌తో పరిసర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగుపడి, లో-వోల్టేజీ సమస్యలు, విద్యుత్‌ అంతరాయాలు తగ్గనున్నాయి. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు, రహదారులు, సాగునీరు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.