తెలంగాణ
కాంగ్రెస్లో మళ్లీ విభేదాల సెగ.. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి!..
వనపర్తి కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారితీశాయి. తన 48 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరిస్తూనే ముందుకు సాగుతున్నానని చిన్నారెడ్డి అన్నారు. గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో కొంతకాలంగా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. తప్పులు చేస్తున్న వారిని బయటకు పంపించే రోజు వస్తుందని, తాము పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. స్వార్థపరుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి అభివృద్ధి తప్ప ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
