క్రైమ్

ఏటీఏంలో వాకీటాకీ.. మహిళకు మస్కా కొట్టి రూ.2.9 లక్షలు స్వాహా!

ఈజీ మనీ కోసం కొందరు అక్రమార్కులు అమాయకులను మోసం చేస్తున్నారు. వారి భయం, అభద్రతా భావాన్ని లక్ష్యంగా చేసుకుని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా మోసాల బారిన పడుతుండగా.. ఇటీవలి కాలంలో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పోలీసులు, డాక్టర్లు సైతం మోసపోతున్నారు. తాజాగా ఓ మహిళను ఓ మాయగాడు బురిడీ కొట్టించాడు. ఏటీఎంలో వాకీటాకీ అమర్చి బాధితురాలిని భయాందోళనకు గురిచేశాడు. అనంతరం రూ.2.9 లక్షలు కొట్టేశాడు.వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ పట్టణానికి చెందిన ఓ మహిళ డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వెళ్లింది. అక్కడ రూ.27 వేలు విత్‌డ్రా చేసింది. డెబిట్ కార్డు యంత్రంలోనే ఇరుక్కుపోగా ఎంత తీసినా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఏటీఎంలో అమర్చిన వాకీ-టాకీతో సదరు మహిళను బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు.