National

దీపావళి వరకు ఆగండి.. రాహుల్ గాంధీకి మరోసారి ఢిల్లీ వ్యాపారుల రిక్వెస్ట్..!

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశరాజధాని ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు నవంబర్ 1 సుమారు 10వేల మందితో నిరసన ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్రంలోని మోడీ సర్కార్.. సీఈసీని అడ్డం పెట్టుకుని ఓట్ చోరీకి పాల్పడుతోందని, అందుకే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలకు రాహుల్ పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యూ ఢిల్లీలో కేంద్రం పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేస్తున్నారు.ఇదిలాఉండగా, నవంబర్ 1న రాంలీలా మైదానంలో నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీని దీపావళి పండుగ ముగిసే వరకు వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపార సంఘాలు మరోసారి రాహుల్ గాంధీని కోరాయి.