క్రైమ్
వివేకా హత్య కేసు.. రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన సునీల్ యాదవ్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు చోటుచేసుకున్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్న అధికారులు, రెండో నిందితుడైన (A2) సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, రూటింగ్‌పై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
