సినిమా
Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!
Vishwambara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
మెగాస్టార్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూపించనున్నారనే ప్రచారంతో ఫస్ట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే వచ్చిన కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే 2025 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది. అనంతరం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే వార్తలు వినిపించినా అది కూడా జరగలేదు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త మూవీ ‘కాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు.
