రాజకీయాలు

Vishal: విజయ్ పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లో సాధించిన అపూర్వ విజయంపై ప్రముఖ నటుడు విశాల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేకమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి విఫలమైనప్పటికీ, విజయ్ మాత్రం తక్కువ సమయంలోనే సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించగలిగారనే దానిపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారు. సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరని పేర్కొన్న విశాల్... గతంలో శివాజీ గణేశన్, కే భాగ్యరాజ్ వంటి దిగ్గజ నటులు సొంత పార్టీలు పెట్టినా విజయం సాధించలేకపోయారని గుర్తుచేశారు.