National

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్?: ప్రయాణికులకు షాక్.. వైరల్ వార్తలపై స్పందించిన రైల్వే!

విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దక్షిణ కోస్తా రైల్వే అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రూట్ మ్యాప్, టైమ్‌టేబుల్స్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.