International
Viral: స్వలింగ సంపర్క జంట.. సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కానున్న ప్రధాని దంపతులు!
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్, ఆయన భాగస్వామి నికోలస్ కీనన్ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలోకి రాబోయే తొలి సంతానం కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని, 2027లో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు ఈ స్వలింగ సంపర్క జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోజనాలు లేకుండా, స్నేహితుల సహకారంతోనే జరిగిందని జెట్టెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాట్స్ 66 (D66) పార్టీ స్పష్టం చేసింది. నెదర్లాండ్స్ చట్టాలకు లోబడి ఐవీఎఫ్ పద్ధతిలో ఈ గర్భధారణ జరిగిందని, ఎగ్ డోనర్‌గా, సరోగేట్ తల్లుగా వ్యవహరించిన తమ స్నేహితురాలికి జంట కృతజ్ఞతలు తెలిపింది.
