వైరల్ న్యూస్

VIRAL: ఏంటీ ‘మనిషి చేష్టలు’ .. క్వార్టర్ సీసాను తాగేసి కునుకు తీసిన కోతిబావ!

 మనుషులు ఏదైనా తిక్క పనులు చేస్తే ఏంటీ ఈ ‘కోతి చేష్టలు’ అని తిట్టడం సహజం. అయితే ఒక కోతి చేసిన పని చేసిన వారంతా ఏంటీ ఈ ‘మనిషి చేష్టలు’ అనేలా చేసింది. ఎప్పుడూ పండ్లు తినీ తినీ బోర్‌ కొడుతోందనుకుందో ఏమో ఓ వైన్స్‌పై కన్నేసింది. దుకాణంలో ఉన్న వాళ్లంతా "ఏం కావాలి భయ్యా?" అని అడిగేలోపే... కౌంటర్‌పై ఉన్న ఒక క్వార్టర్ సీసాను స్టైల్‌గా చేతిలోకి తీసుకుంది. ఇక అసలు సిసలైన టాలెంట్ అప్పుడే బయటపడింది. ఏమాత్రం తడబడకుండా, మూతను తన పళ్లతో ‘పప్‌’మని ఓపెన్ చేసి, డైరెక్ట్‌గా గటగటా తాగేసింది. సీసా ఖాళీ చేసే స్పీడ్ చూసి అక్కడున్న మందుబాబులంతా నోరెళ్లబెట్టారు.