చిత్రం లేదు
క్రీడలుVIRAL VIDEO: మైదానంలోనే కంటతడి పెట్టుకున్న హర్మన్‌ప్రీత్!
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఎట్టకేలకు తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడిన ఆమె.. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విధ్వంసకరంగా ఆడి ఏకంగా 91 పరుగులు సాధించింది.
