వైరల్ న్యూస్
‘రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే సచ్చిపోతా..’ కాంగ్రెస్ పాలనపై రైతు ఆవేదన!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఓ సాధారణ పౌరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదరు వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను సచ్చిపోతా..’ అంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై తన ఆవేదనను వెల్లగక్కాడు. సదరు రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ సరైన విధంగా అమలు కావడంలేదని తేల్చిచెప్పాడు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పక్కాగా అమలు కావడం లేదని మండిపడ్డాడు.
