వైరల్ న్యూస్

Viral Story: తప్పు అడ్రస్‌కు ఆర్డర్.. గ్రాడ్యుయేట్‌కు డెలివరీ బాయ్‌ పాఠం!

పొరపాట్లు జరగడం సహజం.. కానీ ఆ పొరపాట్లను ఇతరులు ఎదుర్కొనే విధానం మనకు కొన్నిసార్లు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలను నేర్పుతుంది. బెంగళూరులో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటనే దీనికి నిదర్శనం. మాన్సీ శర్మ అనే మహిళ పొరపాటున బ్లింకిట్(Blinkit) యాప్‌లో తప్పుడు అడ్రస్‌కు ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే, ఆ తర్వాత డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద చదువులు చదివిన వారికే ఒక గొప్ప పాఠం నేర్పేలా చేసింది.