క్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మైదాన పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ ఆరంభం నుంచే సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు సాధించాడు. అతని మైండ్ గేమ్‌ను దెబ్బతీసేందుకు తిలక్ వర్మ వైభవ్ దగ్గరకు వెళ్లి "వైస్ కెప్టెన్.. ఏంటిది?" అంటూ సరదాగా ఆటపట్టించాడు.
