వైరల్ న్యూస్
గుజరాత్లో వింత ఘటన.. బావిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీళ్లు!
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన స్థానికులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలోని విర్పర్ద గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో నీళ్లు కొన్ని రోజులుగా వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ, అలల మాదిరిగా కదులుతుండటం కలకలం రేపింది. అయితే, ప్రజలు భయాందోళన చెందుతున్నట్లుగా ఇది భూకంపానికి సంబంధించిన చర్య కాదని, భూగర్భంలో జరుగుతున్న సహజ సిద్ధమైన ప్రక్రియ వల్లే ఇలా జరుగుతోందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
