వైరల్ న్యూస్
Viral: 60రోజులు నిద్రపోయే పోటీలు.. రూ.9.6లక్షలు గెలుచుకున్న మహిళ!
సాధారణంగా ఉద్యోగం అనగానే రోజువారీ ఆఫీస్ పనులు, కష్టపడి చెమటోడ్చడాలే గుర్తొస్తాయి. అయితే కేవలం హాయిగా నిద్రపోతూ లక్షల రూపాయల సంపాదనను సొంతం చేసుకోవచ్చని ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే మహిళ నిరూపించింది. ప్రముఖ నిద్ర పరికరాల ఉత్పత్తుల తయారీ సంస్థ 'వేక్‌ఫిట్' (Wakefit) వినూత్నంగా నిర్వహించిన 60రోజుల 'స్లీప్ ఇంటర్న్‌షిప్' (Wakefit Sleep Internship) పోటీ ఐదో సీజన్లో ఆమె విజేతగా నిలిచారు. సుదీర్ఘంగా రెండు నెలల పాటు రోజువారీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకుంటూ ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేసినందుకు గానూ ఆమె ఏకంగా రూ.9.6 లక్షల భారీ నగదు బహుమతిని దక్కించుకున్నారు.
