వైరల్ న్యూస్
Viral : రూ.16కే డ్రెస్ మెటీరియల్, ఆఫర్ 16 నిమిషాలే.. చివర్లో బిగ్ ట్విస్ట్!
పండుగలు, జాతీయ సెలవు దినోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్స్ యాజమానులు ఆఫర్స్ ప్రకటించడం కామన్.నిన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ బట్టల దుకాణ యాజమాని వింతైన ఆఫర్ ప్రకటించాడు. ఏ రకమైన డ్రెస్ మెటీరియల్ కొనుగోలు చేసినా రూ.16 మాత్రమే అని.. ఆ ఆఫర్ కూడా కేవలం రూ.16 నిమిషాలు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. ఆ షాపునకు వెళ్లే దారంతా జనాలు నిండిపోయారు. వారంతా పరుగులు తీయడంతో సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
