క్రైమ్
పోలీసులపై గ్రామస్తుల మూకుమ్మడి దాడి..వాహనాలు, ఫోన్లు ధ్వంసం
గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై మూకుమ్మడి దాడి జరిగింది.ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సీఐ, ఏఎస్ఐ సహా నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. వివరాల్లోకివెళితే..ఓ వ్యక్తి తన పెరట్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.కేసు తదుపరి విచారణ కోసం పోలీసు బృందం ఆ గ్రామానికి వెళ్లగా.. గంజాయి సమాచారం ఎవరిచ్చారంటూ పోలీసులనే గ్రామస్తులు నిలదీశారు. మహిళలతో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది.పోలీసు వాహనంతో పాటు వారి ఫోన్లు ధ్వంసమయ్యాయి.అయితే, పోలీసులే కులం పేరుతో తమను దూషించారంటూ ఆదివాసీల ఆరోపిస్తున్నారు.
