తెలంగాణ
సబ్సిడీ నిధులు గోల్మాల్.. కలెక్టర్ నివేదికతో కదిలిన ఫైల్!
వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖలో వేరుశనగ విత్తనాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది! విత్తన సబ్సిడీ నగదు జమలో అక్రమాల ఆరోపణలతో దౌల్తాబాద్ ఎంఏఓ లావణ్యను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇదే వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ కాగా, ఉన్నతాధికారుల పాత్రపై విచారణ వేగవంతమైంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది!
