ఏపీ
Vijayawada: విజయవాడ బైపాస్‌లో దారుణం.. ఈవీ కారు ప్రమాదంలో నలుగురు సజీవ దహనం!..
విజయవాడ బైపాస్ రోడ్డులో నడిరోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. బైపాస్ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఈవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి, వాహనం క్షణాల్లోనే తగులబడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
