ఏపీ

ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు సమర్పించిన అమ్మవారి బంగారు ఆభరణాల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలపై గోల్డ్ అప్రైజర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలను రసీదుల్లో తక్కువ తూకం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే గోల్డ్ అప్రైజర్ షమీపై తీవ్ర ఆరోపణలు రావడంతో, అప్పటి ఈవో శీనా నాయక్ ఆయనను సస్పెండ్ చేశారు. కానీ, ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తి పునఃప్రవేశం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.