ఏపీ
విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ స్జాపనకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో సోమవారం(నేడు) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యక్ష ఎన్నికల రేసులో కానీ, ముఖ్యమంత్రి పదవి రేసులో కానీ ఉండబోనని తేల్చిచెప్పారు.
