కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన విజయ సాయి రెడ్డి
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరిట మరో కొత్త పొలిటికల్ పార్టీ ఉద్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ పార్టీని స్థాపించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జనం కోసం.. జనం హితం’ కోసం అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లి పనిచేస్తామని ప్రకటించారు. కొత్త తరం, కొత్త ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ముందుకు వెళ్తుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయాలకు నాంది పలకడమే తమ లక్ష్యమని పార్టీ ప్రకటన సందర్భంగా విజయసాయి రెడ్డి చెప్పారు. పరివర్తన రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరాలతో ‘PRP’గా దానికి నామకరణం చేశారు. ఏపీలో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ), ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
