Virosh Divorce Rumors: విజయ్-రష్మికనూ వదలని దుర్మార్గులు.. ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తార్రా?
Virosh Divorce Rumors: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలంటే కొందరికి కేవలం ఒక ఆట వస్తువులా మారిపోయింది. వాళ్లు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే ఆసక్తి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వాళ్ల కాపురాలపై విషం కక్కే స్థాయికి దిగజారడం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. తాజాగా టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న నీచ ప్రచారం చూస్తే.. అసలు ఈ వికృత చేష్టలు ఎక్కడిదాకా వెళ్తాయి? ఇంకెంత మంది సెలబ్రిటీల జీవితాలతో ఇలా ఆడుకుంటారు? అనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాదే ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు విజయ్, రష్మిక. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చి సందడి చేసింది. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా మొదలుపెట్టిన ఈ కొత్త జంటపై కొందరు అప్పుడే పడి ఏడవడం మొదలుపెట్టారు
