తెలంగాణ

ఆటో‌డ్రైవర్‌తో ఇద్దరు అమ్మాయిల ఫైటింగ్.. వీడియో వైరల్

ఆటో డ్రైవర్ , ఇద్దరు అమ్మాయిలు పరస్పరం రోడ్డు మీద దాడులు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో చార్జీల విషయంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే... ఇద్దరు అమ్మాయిలు ఆటోలో ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబ్బులు విషయంలో ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ముందుగా అనుకున్న అమౌంట్ కంటే డ్రైవర్ ఎక్కువగా డిమాండ్ చేశాడని యువతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్టు తెలిసింది. ఇద్దరు అమ్మాయిలు, ఆటో డ్రైవర్ పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.