VCSajjanarControversy: ఊహించిందే బాస్?
తెలంగాణలో ఐపీఎస్ సజ్జనార్ తెలియని వారుండరు. ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన తెర వెనుక వ్యవహారశైలిని సైతం తెలంగాణ ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎంత ప్రచారం జరిగితే అంత ఫోకస్ ఉంటుంది. అలాంటి అధికారిపై అనేక ఆరోపణలు వస్తుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నాపై ఉంటుంది. తప్పు అయితే నా వార్తతో మీ ఉద్యోగం పోదు. అదే ఆరోపణలో 40శాతం నిజం అయినా మీ అత్మ ప్రశ్నిస్తుంది. బ్యూరో క్రాట్స్ చేసే తప్పిదాలను ఎత్తి చూపకపోతే ఒక్కరిని చూసి మరో అధికారి బరితెగించి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతారని జనం వాపోతున్నారు. అందుకే తెలంగాణలో అక్రమాలను తగ్గించేందుకు మీ కంటే ఎక్కవ రాత్రింబవళ్లు కష్టపడి ప్రభుత్వ భూములను, వ్యవస్థలో ఉండే కొంతమంది కళాకారులను గుర్తించి వాళ్ల అసలు రూపాన్ని బయటపెడుతున్నా.
