సినిమా
మహేష్ వారణాసి సినిమాలో సాంగ్స్ లేవా? ఫ్యాన్స్ ఒప్పుకోరుగా!
Varanasi: కీరవాణి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టి, జనవరి వరకూ కంప్లీట్ చేస్తామని చెప్పాడు. అలాగే, ఇందులో మొత్తం 6 పాటలున్నాయని, వాటిలో 4 పాటలు ఇప్పటికే పూర్తయ్యాయి.. ఇంకో 2 పాటలను కంపోజ్ చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి, వారణాసి సినిమా సాంగ్ కి సంబందించి వచ్చిన రూమర్స్ కి కీరవాణి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక, ఈ సినిమాను 120 దేశాలలో మొత్తం 20 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎ.ఎస్.రాజమౌళి.
