సినిమా

Varanasi: మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రాజమౌళి..

Varanasi: మహేష్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ వారణాసి సినిమాలోని పాత్ర గురించి ట్వీట్ ద్వారా వెల్లడించాడు జక్కన్న. “రుద్ర తన జీవితానికి మించి ఓ గొప్ప కార్యాన్ని చేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడు. తను అడగని విధిని మోస్తాడు. రుద్ర చమత్కారిగా కనిపిస్తాడు.. అలాగే సాఫ్ట్ గా కనిపిస్తాడు. అంతేకాదు, ఒక రుద్రుడిగానూ కనిపిస్తాడు. రౌద్రంగా ఎవరైనా చేస్తారు.. కానీ సున్నితత్వంతో పాటుగా చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒక్క మహేష్ మాత్రమే చెయ్యగలడు” అని రాజమౌళి ట్వీట్ లో రాసుకొచ్చాడు.