సినిమా
Varanasi: AI వాయిస్‌లను రిజెక్ట్ చేసిన రాజమౌళి!1500 రియల్ వాయిస్‌లే
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నిన్నా మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లను ఉపయోగించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్‌లను టెస్ట్ చేశారట. ఒరిజినల్ వాయిస్‌లతోనే డబ్బింగ్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది.
