చిత్రం లేదు
తెలంగాణ

Vaishnavi Episode: యూట్యూబర్ వైష్ణవి ఉదంతం.. మనకు ఏం నేర్పుతోంది..?

Vaishnavi Episode: ఒక నిండు ప్రాణం బలైపోయింది.. మరొకరి జీవితం కటకటాల పాలైంది.. ఇంకొకరి కుటుంబం నడిరోడ్డుపై నిస్సహాయంగా మిగిలిపోయింది.. యూట్యూబర్ వైష్ణవి విషాదాంతం, దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తోంది అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకరు కాదు.. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు చేసిన తప్పిదాలే చివరకు ఈ తీవ్ర పరిణామాలకు దారితీసినట్లు కనిపిస్తుంది.వైష్ణవి జీవితంలో తీసుకున్న మొదటి నిర్ణయమే ఆమె పాలిట శాపంగా మారినట్లు కనిపిస్తుంది. కన్నవారి అనుభవాన్ని, వారి ఆందోళనను పక్కనపెట్టి.. హరిబాబు ఎలాంటి వాడు, అతని నేపథ్యం ఏమిటి అనే కనీస ఆలోచన లేకుండా అతనిని పెళ్లి చేసుకోవడం ఆమె చేసిన పెద్ద పొరపాటు. వయసుతో వచ్చే ఆకర్షణను ప్రేమ అనుకుని, కుటుంబానికి దూరమై తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఆమె ఘటన మరోసారి నిరూపించింది. కన్నవారి మాట వినకపోతే జీవితం ఎంతటి అంధకారంలోకి నెట్టబడుతుందో చెప్పడానికి వైష్ణవి విషాదమే ఒక హెచ్చరికహరిబాబు చేసిన నేరం క్షమించరానిది. తాళి కట్టిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి, కన్నతల్లి, అన్నల మాటలు నెత్తికెక్కించుకుని అదనపు కట్నం కోసం ఆమెను నిత్యం వేధించాడు. చివరికి ఆ వేధింపులు ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి దిగజారాయి. సొంత ఆలోచన లేకుండా ఇతరుల చెప్పుడు మాటలు విని, రక్తపు కూడు తిన్న హరిబాబు తన చేతులతో తానే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్యను బలితీసుకుని సమాజం ముందు హంతకుడిగా నిలబడ్డాడు.