జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీలు.. రూ.లక్షలు కొట్టు జాబ్ పట్టు!
రాష్ట్రంలో ఉద్యోగాల పేరిట కొందరు అధికారులు భారీ అవినీతికి తెరలేపారు.జాబ్ కావాలంటే రూ. లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉద్యోగానికి ఇంత చొప్పున అంటూ రేట్ కూడా ఫిక్స్ చేశారు. మెరిట్ లిస్టును పక్కన పడేసి డబ్బులు ఎవరు ఇస్తే వారికే జాబ్ అంటూ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. వైద్యారోగ్యశాఖలో ఈ వ్యవహారం బయట పడగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల కోసం కష్టపడి చదివిన అభ్యర్థుల భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంగా మారింది. మెదక్ జిల్లా పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో 64 కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో అర్హులురెండు వేలకు పైగా మంది దరఖాస్తులు చేసుకున్నారు. మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.కానీ, కొందరు దళారులు కొత్త దందాకు తెరలేపారు. ఉద్యోగం కావాలా? అయితే రూ.లక్షలు ఇవ్వాల్సిందే అని అభ్యర్థులను డిమాండ్ చేసినట్టు సమాచారం.వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో దళారులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది.
