International

USA vs Iran: ఆరు నెలల యుద్ధానికి బ్రేక్?.. ఇరాన్‌పై దాడులు ఆపేసిన ట్రంప్!

పశ్చిమాసియాలో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని ఇంధన, సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేపట్టాలనుకున్న భారీ సైనిక దాడిని అమెరికా విరమించుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు నేటి (ఆగస్టు 3) నుంచి కొత్త దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.