ప్రపంచం

US : భారతీయులకు షాకిచ్చిన ట్రంప్.. గర్భిణీల వీసాలు రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులకు షాక్ ఇచ్చారు. ఇండియా నుంచి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్..ఇటీవలి కాలంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్స్‌ చేతులకు సంకెళ్లు వేయించి మరీ స్వదేశానికి తిప్పి పంపిన విషయం తెలిసిందే. దీనికి తోడు స్థానిక సిటిజన్స్ ఉద్యోగాలను భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. తాజాగా అమెరికాలో ఎవరైన విదేశీ మహిళలు బిడ్డలకు జన్మనిస్తే వారికి పుట్టుకతో వచ్చే సిటిజన్ షిప్ రాకుండా కీలక చర్యలు చేపట్టారు. కేవలం పిల్లలను కనేందుకే ‘బర్త్ టూరిజం’ పేరిట వస్తున్నారని గుర్తించిన ట్రంప్ సర్కార్.. జులై 9 నుంచి ఇప్పటివరకు 600 మంది గర్భిణీల వీసాలు రద్దు చేసినట్టు తెలిసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్టు యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందులో భారతీయ మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం.