US Iran War: అమెరికా - ఇరాన్ మధ్య చైనా రాయబారం.. యుద్ధం ముగిసేనా?
US Iran War: పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఊహించని సరికొత్త దౌత్య సమీకరణాలు తెరపైకి వచ్చాయి. సాధారణంగా వాణిజ్యం, ఆధిపత్య పోరులో అమెరికాకు బద్ధ శత్రువుగా కనిపించే చైనా.. ఇప్పుడు ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించే కీలక రాయబారిగా మారడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌ను చర్చల వైపు నడిపించడానికి బీజింగ్ తనకున్న పలుకుబడిని ఉపయోగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను కోరినట్లు 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించిన కథనం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.యుద్ధాన్ని కేవలం సైనిక బలంతో కాకుండా, ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే దేశాల ద్వారా ఒత్తిడి తెచ్చి ముగించాలన్నది వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బీజింగ్‌తో ముమ్మర సంప్రదింపులు జరిపారు.
