ప్రపంచం

US Iran War: హర్మూజ్‌లో హైటెన్షన్.. 20కిపైగా యుద్ధ నౌకలు మోహరింపు.. అమెరికా ఏం చేయబోతోంది?

ప్రపంచ చమురు రవాణకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్ నెలకొంది. అక్కడ అమెరికా 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించింది. నేవీ డెస్ట్రాయర్ సహా 20కి పైగా వార్ షిప్స్ ను మోహరించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా చర్య ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అమెరికా ఏం చేయబోతోంది? ఈ చర్య దాడి చేసేందుకా లేక భయపెట్టేందుకా అన్న చర్చ నడుస్తోంది.