International

హర్మూజ్‌పై అమెరికా జెండా.. ట్రంప్‌ సంచలన ప్రకటనతో ఉద్రిక్తతలు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర అలజడి సృష్టించే ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరాన్-అమెరికా మిలిటరీ ఘర్షణల నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌పై అమెరికా పూర్తి విజయం సాధించిన వెంటనే ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని యూఎస్ భూభాగంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.