National

US: అమెరికాలో భారతీయుల కొలువు ఊడినట్లేనా? 540 రోజుల వర్క్ పర్మిట్ రూల్ క్లోజ్!

US: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న లక్షలాది మంది భారతీయులకు ట్రంప్ సర్కార్ భారీ షాకిచ్చింది. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఎదురుచూసే టైంలో ఉద్యోగం పోకుండా అండగా నిలిచే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు రూల్స్‌ని యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ఎత్తేసింది. గతంలో తాత్కాలిక ఊరటగా తీసుకొచ్చిన ఈ నిబంధనను ఇప్పుడు శాశ్వతంగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఈ తాజా దెబ్బతో ముఖ్యంగా హెచ్-4 వీసాలపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ జీవిత భాగస్వాములు తీవ్ర సంక్షోభంలో పడనున్నారు. హెచ్-1బీ వీసాదారుల భార్యలు లేదా భర్తలు అక్కడి కంపెనీల్లో పని చేయడానికి ఈ వర్క్ పర్మిట్ మాత్రమే ఆధారం. గతంలో రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా 540 రోజుల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది.