National

US Elections: ఈసీ లేని అమెరికా ఎన్నికలు.. ఇండియా మోడల్ వైపు ట్రంప్ చూపు!

US Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అయితే, అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. కానీ ఈ రెండు దేశాల్లో ఎన్నికలు జరిగే తీరు చూస్తే మాత్రం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నికలు జరగాలంటే ఒకటే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉంటుంది. వాళ్లు గీసిన గీతే రూల్. ఓటర్ లిస్ట్ దగ్గరి నుంచి పోలింగ్, కౌంటింగ్, రిజల్ట్స్ దాకా అంతా ఒకే పద్ధతిలో నడుస్తుంది. కానీ అగ్రరాజ్యం అమెరికాలో అసలు కేంద్ర స్థాయిలో ఎన్నికల సంఘం అనే మాటే ఉండదు. అక్కడ మొత్తం 50 రాష్ట్రాలుంటే.. 50 రకాల చట్టాలు, 50 రకాల రూల్స్ నడుస్తాయి. ప్రెసిడెంట్ ఎన్నికలైనా సరే, ఆయా రాష్ట్రాలే తమకు నచ్చినట్లు ఓటింగ్ పెట్టుకుంటాయి. ఈ మొత్తం తలనొప్పిని చూసి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. "మాకు కూడా ఇండియా లాంటి సెంట్రలైజ్డ్ ఎలక్షన్ సిస్టమ్ కావాలి" అంటూ పట్టుబడుతుండటంతో ఇప్పుడు అమెరికాలో పెద్ద రచ్చ మొదలైంది.