National

సీజేపీ వెనుక అమెరికా.. నిధుల వరద పారుతోంది : అమెరికా సింగర్ మేరీ మిల్బెన్

భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశానికి చెందిన సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఓటు చోరీ, ఎస్ఐఆర్‌లో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఓట్ల చోరీకి పాల్పడుతూ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే, ఆ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సీజేపీ ఫౌండర్ అభిజీత్, విపక్ష కూటమి నిరసనలకు దిగుతున్న తరుణంలో అమెరికన్ సింగర్ ట్వీట్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి వ్యతిరేకంగా ఉన్న అమెరికా శక్తులే కాక్రోచ్ పార్టీ వెనుకండి నడిపిస్తున్నాయని మిల్బెన్ స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు విదేశీ నిధులతో సాగుతున్న ఈ విద్రోహ చర్యలపై మౌనంగా ఉండే సమయం ఇది కాదని మేరీ మిల్బెన్ పేర్కొన్నారు.