తెలంగాణ
శ్రీ చైతన్యలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కర్రలతో కొట్టి, బూట్లతో తొక్కి!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ప్రైవేటు విద్యాసంస్థ అయిన శ్రీచైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చిత్రహింసలు చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.అయితే, సీనియర్ విద్యార్థులు అతన్ని దారుణంగా కొట్టినట్టు తెలిసింది. కర్రలతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని తెలిసింది. రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌ను సీనియర్ విద్యార్థులు 12 మంది కర్రలు,ప్లేట్లతో తీవ్రంగా దాడి చేయడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
