క్రైమ్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. గుట్టంతా ఫోన్లోనే?
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉదయ్ పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను రెండు రోజుల పాటు విచారణ చేసేందుకు ఉప్పరపల్లి కోర్టు ఓకే చెప్పింది. లైంగిక వేధింపుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.
