National
UPI Payments: కేంద్రం సంచలనం.. UPI పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్సభ ఆమోదం
యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ''పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007'' చట్ట సవరణ బిల్లు లోక్ సభ లో పాస్ అయ్యింది. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అంటే, ఇకపై ఛార్జీల వసూళ్ల పూర్తి అధికారం బ్యాంకులకు ఇచ్చింది కేంద్రం. లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లును రాజ్యసభకు పంపింది. అక్కడ కూడా ఆమోదం తెలుపనుంది. అనంతరం రాష్ట్రపతి రాజముద్రతో ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి రానుంది.
