National

UPI Charges: UPI ఛార్జీలు.. యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్రం కీలక ప్రకటన

UPI Charges: యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై త్వరలోనే ఛార్జీలు విధించనున్నారనే వార్తలు అటు యూజర్లను, ఇటు వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూపీఐ ఛార్జీల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ యూజర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. యూజర్లు, వ్యాపారులపై యూపీఐ ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం లోక్ సభలో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007 సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో యూజర్లు లేదా వ్యాపారులపై ఛార్జీలు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి తెరదించుతూ కేంద్రం స్పష్టతనిచ్చింది.