బోర్డర్లో అలజడి.. ముగ్గురు ఆర్మీ జవాన్లపై మూక దాడి!
నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాసే భద్రతా బలగాలపై ఓ మూక దాడి చేయడం సంచలనంగా మారింది. కొందరు ప్లాన్ ప్రకారమే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహానాన్ని అడ్డుకుని కర్రలతో దాడులకు పాల్పడినట్టు తెలిసింది. బంగ్లాదేశ్, చైనాకు సమీపంలో ఉండే త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల జిల్లా బోక్సానగర్ పరిధిలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లపై దాడులకు పాల్పడిన వారిని స్మగ్లర్లుగా గుర్తించారు. నిందితులు కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గస్తీ కాస్తున్న బలగాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఓ వైపు దాడికి పాల్పడుతూనే నిందితులు జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.
