క్రైమ్

తగలబెట్టి ప్రాణాలు తీసినా మారనితీరు.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అవినీతి తిమింగలాలు!

 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ కార్యాలయం మళ్లీ వార్తల్లోకెక్కింది. గతంలో అవినీతి, లంచాల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి కార్యాలయంలోనే నాటి మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘోర ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయినా, రెవెన్యూ యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. సరిగ్గా అదే కార్యాలయంలో, అదే తహసీల్దార్ చాంబర్‌లో ఏకంగా రూ.20లక్షల లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది.  ఒక లేఅవుట్ సర్వే నివేదికను అనుకూలంగా ఇచ్చేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి.సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు బాధితుడి నుంచి రూ.20లక్షల భారీ మొత్తాన్ని వసూలు చేస్తుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడి చేసి పట్టుకున్నారు.