National

షాహీ దర్గా తొలగింపు.. మరోమారు ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. "సింహస్థ కుంభమేళా" ఏర్పాట్లలో భాగంగా నగరంలో రోడ్డు విస్తరణ పనులను అక్కడి ప్రభుత్వం చేపట్టింది. అయితే, విస్తరణ మార్గంలో అడ్డుగా ఉన్న 'షాహి దర్గా'కు చెందిన కొంత భాగాన్ని తొలగించేందుకు ఉజ్జయిని మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ వివాదం చెలరేగింది. దర్గా తొలగింపు విషయంలో ముస్లిం వర్గాలు ఎదురుతిరిగాయి.దర్గాను టచ్ చేయవద్దని ఆందోళనకు దిగాయి. ఒక వర్గం వారు రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న హనుమాన్ ఆలయాన్ని స్వయంగా తొలగించేందుకు సిద్ధపడగా.. ముస్లిం వర్గం వారు మాత్రం షాహీ దర్గాను తొలగించేందుకు అడ్డుపడుతున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.